ఏలూరులో ఉన్మాది రెచ్చిపోయాడు. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు. ఏలూరు సత్రంపాడు సాయిబాబా గుడి వద్ద ఈ దారణం చోటు చేసుకుంది. యువతిపై దారుణంగా దాడి చేయడంతో అక్కడే చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రియురాలిపై దాడి తరవాత ప్రియుడు కూడా గొంతుకోసుకున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పీక కోసుకున్న ప్రియుడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అసలు ప్రియురాలిపై ఎందుకు దాడి చేశాడనే విషయం వెల్లడి కావాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.