రిటర్నింగ్ అధికారి సీల్ లేకపోయినా సంతకం ఉంటే అలాంటి పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలను ఏపీ ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు పంపించారు. అయితే ఈ నిబంధనను వ్యతిరేకిస్తున్న వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది.
రాష్ట్ర ఎన్నికల అధికారి ఇచ్చిన మెమో సమంజసం కాదని వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు హైకోర్టు అంగీకరించింది.
పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టత ఇచ్చింది. ఫాం 13ఏపై అటెస్టేషన్ అధికారి సంతకం మాత్రమే ఉండి, సీల్, హోదా లేకపోయినా ఓటు చెల్లుబాటు అవుతుందని ఈసీ వివరించింది. అలాంటి ఓట్లను చెల్లుబాటు అయ్యేవిగా గుర్తించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఆర్వో ధ్రువీకరణ తర్వాతే అటెస్టేషన్ అధికారి ఫాం 13ఏపై సంతకం చేశారని ఎన్నికల సంఘం తెలిపింది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు