కేరళలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వ్యక్తిగత సహాయకుడు అరకిలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు దొరికిపోవడం సంచలనంగా మారింది. కొద్ది కాలం కిందట కేరళ సిఎం కార్యదర్శిపై కూడా బంగారం స్మగ్లింగ్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శిశిథరూర్ పీఏ శివకుమార్ప్రసాద్ను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
శివ కుమార్ ప్రసాద్ వద్ద ఏరోడ్రోమ్ ఎంట్రీ పర్మిట్ గుర్తించారు. ఎంపీ ప్రోటోకాల్ బృందంలో భాగంగా తీసుకున్నట్లు కస్టమ్ష్ అధికారులు అనుమానిస్తున్నారు. బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ప్రసాద్ వ్యవహారంపై శశిథరూర్ ఎక్స్ వేదికగా స్పందించారు. గతంలో తన వద్ద పనిచేశాడని, 72 సంవత్సరాల శివకుమార్ ప్రసాద్‌కు తరచూ డయాలసిస్ అవసరం ఉండటంతో మరలా అతన్ని తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఇలాంటి స్మగ్లింగ్ వ్యవహారాలను క్షమించేది లేదన్నారు.
శశిథరూర్ కేరళ తిరువనంతపురం నుంచి లోక్‌సభకు పోటీచేశారు. ఆయనపై బరిలో దిగిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కాంగ్రెస్ నేతల బంగారం స్మగ్లింగ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో సీఎం కార్యదర్శి బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు, ఇప్పుడు శశిథరూర్ పీఏ దొరికికాడని, కాంగ్రెస్ నేతలు బంగారం స్మగ్లింగులో మునిగిపోయారని విమర్శించాడు. 2020లో దుబాయ్ నుంచి తిరువనంతపురం వచ్చిన విమానంలో సీఎం సెక్రటరీ బ్యాగులో 30 కిలోల స్మగ్లింగ్ బంగారం వెలుగుచూడటం అప్పట్లో పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు