ఆకాశం నుంచి భూమి పైలక్ష్యాలను ఛేదించే M2 మిస్సైల్‌ను భారత్ పరీక్షించింది. ఒడిశా తీరం నుంచి SU30 ఫైటర్ జెట్ ద్వారా ప్రయోగించిన రుద్ర నిర్దేశించిన అన్ని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిందని రక్షణమంత్రిత్వ శాఖ వెల్లడించింది.
రుద్ర M2 మిస్సైల్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. డీఆర్డీఓకు చెందిన పలు లాబోరేటరీలు రూపొందించిన సాంకేతికతలను ఉపయోగించారు. శత్రు లక్ష్యాలను ఛేదించేందుకు రుద్ర క్షిపణిని భారత రక్షణ శాఖ అభివృద్ధి చేసింది.
రుద్రM2విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభినందించారు. రుద్ర పరీక్ష విజయవంతం కావడం భారత సాయుధబలగాల బలాన్ని రెట్టింపు చేసిందన్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు