ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో ప్రమాదం జరిగింది. పటాకులు పేలిన ఘటనలో 15 మంది భక్తులు గాయపడ్డారు. బుధవారం రాత్రి నరేంద్ర పుష్కరిణిలో జగన్నాథ స్వామి చందన ఉత్సవం నిర్వహించారు. ఈ క్రతువును తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.
ఈ క్రమంలో కొంతమంది భక్తులు పటాకులు పేల్చడంతో ఎగిసిపడిన నిప్పురవ్వలు సమీపంలో బాణసంచా నిల్వపై పడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది.ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో కొందరు భక్తులు పుష్కరిణిలో దూకారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం నవీన్ పట్నాయక్ బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితుల చికిత్సకు అవసరమైన నగద సాయం మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెల్లిస్తామని వెల్లడించారు.