భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ఖాతాలో మరో విజయం చేరింది. చెస్‌లో తిరుగులేని కార్ల్‌సన్‌ను నార్వేలో జరుగుతోన్న క్లాసికల్ చెస్ గేమ్‌లో ఓడించి ప్రజ్ఞానంద సంచలన విజయం సాధించాడు. 2024లో నార్వేలో జరిగిన చెస్ టోర్నీలోనూ ప్రజ్ఞానంద, కార్ల్‌సన్‌ను మట్టికరిపించాడు. ర్యాపిడ్, ఎగ్జిబిషన్ గేమ్స్‌లోనూ కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద అనేక సార్లు ఓడించాడు.
చెస్‌లో కార్ల్‌సన్‌కు తిరుగులేని ఆటగాడిగా పేరుంది. పదేళ్లుగా క్లాసికల్ చెస్‌లో అతనిదే పైచేయి. తాజాగా కార్ల్‌సన్‌కు ప్రజ్ఞానంద రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కార్ల్సన్ చేసిన కొన్ని తప్పులను ప్రజ్ఞానంద అవకాశంగా మలుచుకుని విజయం సాధించాడు. ఆట ప్రారంభం నుంచి ప్రజ్ఞానంద వేసిన ఎత్తులు, కార్ల్‌సన్‌ను చిత్తుచేశాయి. ఈ టోర్నీ పాయింట్లలో ప్రజ్ఞానంద మొదటి స్థానానికి చేరాడు. కార్ల్సన్ ఐదోస్థానానికి పడిపోయాడు.
క్లాసికల్ చెస్‌లో ఎత్తులు వేసేందుకు ఆటగాళ్లు ఎంత సమయం అయినా తీసుకోవచ్చు. ఒక్కోసారి గంట సేపు కూడా సమయం తీసుకున్న సందర్భాలున్నాయి.