ఇస్రో మరో మైలురాయిని చేరుకుంది. పూర్తిగా దేశీయంగా ప్రైవేటు రంగంలో రూపొందించిన క్షిపణి అగ్నిబాణ్‌ను శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించారు. అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి అగ్నిబాణ్ క్షిపణిని గురువారం నాడు విజయవంతంగా ప్రయోగించినట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఈ క్షిపణి ప్రయోగానికి సెమీ క్రయోజనిక్ లిక్విడ్ ఇంజన్ ఉపయోగించడం విశేషం. ఇలాంటి ఇంజన్ వాడటం ప్రపంచంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ఈ ప్రయోగంలో సార్టెడ్ ద్వారా మొత్తం వాహనాన్ని నియంత్రించే ఏవియానిక్స్ చైన్ సామర్థ్యం వెల్లడైందని ఇస్రో ఛైర్మన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ వ్యవస్థ ద్వారా 300 కిలోల బరువైన ఉపగ్రహాలను 700 కి.మీ కక్ష్యలోకి ప్రవేశపెట్టడం సులువవుతుందని ఇస్రో తెలిపింది.
అగ్నిబాణ్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్తలకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అభినందనలు తెలిపారు. త్రీడీ ప్రింటెండ్ ఇంజన్ ద్వారా క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ఐఐటీ మద్రాస్ సాయంతో అగ్నికుల్ ఈ వ్యవస్థను దేశంలోనే తయారు చేసిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు