తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలో అరాచకం జరిగింది. ఓ యువతిని ప్రేమించి ఆమెతో సహజీవనం చేస్తోన్న ఓ యువకుడికి దారుణమైన ఘటన ఎదురైంది. సూళ్లూరుపేట సమీపంలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోన్న యువతీ, యువకుడు ప్రేమించుకున్నారు. సహజీవనం చేస్తున్నారు. అతని స్నేహితులు ఏడుమలై, బాలాజీ బుధవారం కలసి మద్యం సేవించారు. తరవాత సూళ్లూరుపేట సమీపంలో దామరాయ శివాలయానికి వెళదామని, యువకుడి ప్రియురాలిని కూడా తీసుకురావాలని ఒత్తిడి చేశారు.
స్నేహితుల మాటలు నమ్మిన యువకుడు, ప్రియురాలితో కలసి దారరాయ సమీపంలో శివాలయానికి తీసుకెళ్లారు. తరవాత పులికాట్ అందాలు చూద్దామంటూ, సమీపంలోని గుట్టల్లోకి తీసుకెళ్లారు. అతని చొక్కా విప్పి, చెట్టుకు కట్టేసి బాలాజీ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. తరవాత వారి వద్ద నున్న సెల్ఫోన్, డబ్బు తీసుకుని పరారయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.