ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. లోక్‌సభ ఎన్నికల ఏడో దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఆ దశకు ప్రచారం నేటితో ముగుస్తోంది.
ఆఖరి దశ ఎన్నికల్లో 7 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 57 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ దశలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లోని అన్ని స్థానాలకూ ఎన్నికలు జరుగుతాయి.
బిహార్‌లోని 8 నియోజకవర్గాలు, హిమాచల్ ప్రదేశ్‌లోని మొత్తం 4 స్థానాలు, జార్ఖండ్‌లోని 3 సీట్లు, ఒడిషాలోని 6 నియోజకవర్గాలు, పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లోని 13 సీట్లు, బెంగాల్‌లోని 9 నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరగనుంది. వాటితో పాటు చండీగఢ్ కేంద్రపాలితప్రాంతంలోని ఒక నియోజకవర్గానికి కూడా ఓటింగ్ జరుగుతుంది. శనివారం సాయంత్రం పోలింగ్ ముగియడంతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.