వచ్చే 24 గంటల్లో కేరళలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, మాల్దీవుల్లోని మిగిలిన భాగాలు మరియు కొమోరిన్ ప్రాంతంలోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయి .
ఆంధ్ర ప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపోఆవరణములో నైపశ్చిమ దిశ గా గాలులు వీస్తున్నాయి .
బుధవారం, గురువారం తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రత రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉంది. శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలుచోట్ల వానలు కురిసే అవకాశముంది.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు