బస్సు లోయలో పడిన ఘటనలో 28 మంది మరణించారు. ఈ ఘటన పాకిస్తాన్ లోని బలూచిస్థాన్ రాజధాని క్వెట్టా సమీపంలో చోటుచేసుకుంది. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
టర్బాట్ నుంచి క్వెట్టాకు వెళుతున్న బస్సు కనుమ మార్గంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదం కారణంగా 28 మంది అక్కడికక్కడే మరణించగా మరో 22 మంది గాయపడ్డారు.
ప్రమాదం సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు బాధితులను ఆస్పత్రికి తరలించాయి. ఇటీవల బాల్టిస్తాన్ లో కూడా ఈ తరహా ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడిపోవడంతో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.