Tuesday, July 8, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

లాహోర్ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్‌తో యుద్ధం చేసామని ఒప్పుకున్న పాక్

Phaneendra by Phaneendra
May 29, 2024, 04:22 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

1999లో భారతదేశంతో కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందని ఆ దేశపు మాజీ ప్రధానమంత్రి, పిఎంఎల్-ఎన్ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ అంగీకరించారు. పాకిస్తాన్ అణుపరీక్షలు చేసి 26 సంవత్సరాలు అయిన సందర్భంలో మంగళవారం, మే 28న నవాజ్ షరీఫ్ మాట్లాడారు. తమ దేశమే లాహోర్ డిక్లరేషన్‌ను ఉల్లంఘించి భారతదేశంతో యుద్ధం చేసిందనీ ఆయన ఒప్పుకున్నారు.

లాహోర్ డిక్లరేషన్‌ మీద 1999లో నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ, అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంతకాలు చేసారు. పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషర్రాఫ్ దుందుడుకు చర్య అయిన కార్గిల్ యుద్ధం, పాకిస్తాన్ తప్పిదమని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు.  

‘‘1988 మే 28న పాకిస్తాన్ ఐదు అణు పరీక్షలు చేసింది. దాని తర్వాత వాజ్‌పేయీ సాహెబ్ మన దేశానికి వచ్చారు. మనతో ఒప్పందం చేసుకున్నారు. కానీ ఆ ఒప్పందాన్ని మనం ఉల్లంఘించాం. అది మన తప్పు’’ అని నవాజ్ షరీఫ్ తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో చెప్పారు.

భారత పాకిస్తాన్ దేశాలు 1999 ఫిబ్రవరి 21న కుదుర్చుకున్న ఒప్పందమే లాహోర్ డిక్లరేషన్. ఇరు దేశాల మధ్యా శాంతిభద్రతలు నెలకొల్పడం, ఇరుదేశాల ప్రజల మధ్యా సత్సంబంధాలు నెలకొల్పడం దాని లక్ష్యాలు. అయితే కొద్ది నెలలకే పాకిస్తాన్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత్‌పై యుద్ధం ప్రకటించింది. అదే కార్గిల్ యుద్ధం.

1999లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషర్రాఫ్ భారతదేశపు లద్దాఖ్ ప్రాంతంలోని కార్గిల్ జిల్లాలోకి రహస్యంగా చొరబడాలని ఆదేశించాడు. ఫలితంగా ఇరుదేశాల మధ్యా పూర్తిస్థాయి యుద్ధం జరిగింది. ఆ కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించింది.

Tags: Atal Bihari VajpayeeBharatKargil WarLahore Declaration ViolationNawaj SharifPakistanSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.