చైనా బలగాలను భారత సైనికులు సునాయాసంగా ఓడించారు. కదన, క్రీడారంగాల్లో భారత్ సత్తా ఏ మాత్రం తక్కువ కాదని భారత ఆర్మీ మరోసారి నిరూపించింది.
సూడాన్ లో శాంతి స్థాపన కోసం ఐక్యరాజ్యసమితి తరఫున వెళ్లిన భారత సైనిక బలగాలకు, అక్కడే విధులు నిర్వహిస్తున్న చైనా సైనికుల మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్ లో భారత్ పైచేయి సాధించింది.
సరదాగా సాగిన క్రీడలో మనోళ్ళు సత్తా చాటారు. చైనా సైనికులను ఓడించి సంతోషంతో చిందులు వేశారు. సదరు వీడియోను ఆర్మీ ఉన్నతాధికారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సూడాన్ లో శాంతి ఒప్పందంలో భాగంగా ఐక్యరాజ్యసమితి బలగాలు మోహరించింది. యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ ద సూడాన్ పేరుతో ఏర్పాటు చేసిన మిషన్ లో భారత్ తో పాటు చైనా బలగాలు కూడా ఉన్నాయి. శాంతి స్థాపనకు కృషి చేయడంతో పాటు మానవతా సాయం, భద్రతా, మానవ హక్కుల ప్రమోషన్ తదితర లక్ష్యాల కోసం ఈ మిషన్ ఏర్పాటైంది.