సామాజిక భద్రత పింఛన్ల నగదును ఈసారి కూడా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 1న గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా అందజేసిన ప్రభుత్వం మే నెలలో మాత్రం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.
జూన్ నెలలో అందజేసే నగదు మొత్తాన్ని కూడా ఈసారి కూడా బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడేవారికి మాత్రం ఇంటి దగ్గరే పంపిణీ చేయనున్నారు.