అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యాదగిరిగుట్టకు చెందిన యువతి సౌమ్య ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే ఫ్లోరిడాలోని అట్లాంటిక్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసిన సౌమ్య ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. తండ్రి కోటేశ్వరరావు సీఆర్పీఎఫ్‌లో పదవీ విమరణ చేసి యాదగిరిగుట్టలో కిరాణా దుకాణం నడుపుకుంటున్నారు. ఎంతో కష్టపడి ఉన్నత చదువులు పూర్తి చేసిన యువతి సౌమ్య మరణంతో కోటేశ్వరరావు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రెండు నెలల కిందటే యాదగిరిగుట్టకు వచ్చిన సౌమ్య 2 రోజులు ఉండి మరలా వెంటనే అమెరికా వెళ్లారు. ఇటీవలే చదువు పూర్తి కావడంతో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. సరకులు తెచ్చుకునేందుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టినట్లు ఆమె సహ విద్యార్థిని ద్వారా తెలిసిందని తండ్రి కోటేశ్వరరావు చెప్పారు. సౌమ్య మృతదేహం స్వదేశానికి తీసుకువచ్చేందుకు సాయం చేయాలని ఆయన అభ్యర్థిస్తున్నారు.
గత ప్రభుత్వంపై ఉపముఖ్యమంత్రి డ్రగ్స్ వ్యాఖ్యల కలకలం