బ్రిటిష్ వలసపాలన బానిసత్వం నుంచి భారతదేశాన్ని విముక్తం చేయడానికి దేశం నలుమూలల నుంచీ ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ప్రతీ భారతీయుడూ తన శక్తిమేర కష్టపడ్డాడు. దేశం కోసం ఎంతోకొంత చేయాలన్న తపన 1857 తిరుగుబాటు తర్వాత ప్రతీ పౌరుడిలోనూ బాగా పెరిగింది. ఆ తిరుగుబాటులో దేశపు ఉత్తర, పశ్చిమ భాగాల ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. ఆరోజుల్లో ఆ ఉద్యమపు సజీవగాధను సామాన్యులకు చేర్చడం చాలా ముఖ్యంగా ఉండేది. దానివల్ల ప్రజల్లో జాతీయతాభావాన్ని ప్రోది చేయడం సాధ్యమయ్యేది. అటువంటి విప్లవవీరుల చిరంజీవ గాధలు సాహిత్యంలో నిక్షిప్తమై ఉన్నాయి. అవి భవిష్య తరాలకు స్ఫూర్తి, ప్రేరణ కలిగిస్తూనే ఉంటాయి. తన రచనా శక్తి ద్వారా ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ విశేషాలను సజీవం చేసిన సమర్థుడైన రచయితగా వినాయక్ దామోదర్ సావర్కర్ నిలిచిపోయాడు.
వినాయక్ దామోదర్ సావర్కర్ అఖిల భారత హిందూ మహాసభ వ్యవస్థాపకుల్లో ఒకడు. ఆ సంస్థ, స్వామి వివేకానంద ప్రేరణతో, ఈ దేశంలో సామాజిక స్పృహను రగిల్చే ఎన్నో రచనలను ప్రచురించింది. ఆ పుస్తకాలు, వాటి ప్రచురణ, ప్రచారం బ్రిటిష్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. సావర్కర్ రచనలు జాతీయ సమైక్యతను విస్తృతంగా ప్రచారం చేసాయి. ఫలితంగా హిందువుల కాషాయధ్వజం, ముస్లిముల ఆకుపచ్చజెండా రెండూ నీలి ఆకాశంలో కలిసి, తెల్లవాడి యూనియన్ జాక్‌కు వ్యతిరేకంగా ఎగిరాయి. అయితే దేశీయ ప్రభుత్వం స్థిరంగా లేకపోవడం, బలహీనంగా ఉండడాన్ని అవకాశంగా తీసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం సావర్కర్ రచనలు ఎన్నింటినో నిషేధించింది. వాటిలో ప్రధానమైనది, 1906లో రాసిన ‘రివోల్ట్ ఆఫ్ 1857’. ఎందుకంటే, కులం మతం జాతి వంటి విషయాలను పక్కన పెట్టి ప్రజల్లో జాతీయతావాదం, సోదరభావాలను కలగజేయడంలో ఆ పుస్తకం నిప్పురవ్వలు రగిలించింది. అతని రచనల ప్రభావం కారణంగానే 1910 డిసెంబర్ 23న సావర్కర్‌కు 50 ఏళ్ళకు సరిపడా రెండు జీవితఖైదు శిక్షలు విధించబడ్డాయి. అండమాన్ నికోబార్ దీవుల్లోని కాలాపానీ జైలులో మరికొన్ని రోజుల్లో శిక్ష విధించానికి ముందు సావర్కర్ ముంబై జైల్లో నెల రోజులు, పుణే జైలులో కొన్ని రోజులూ ఉన్నాడట.
అండమాన్ నికోబార్ దీవుల్లోని కాలాపానీ జైలులో శిక్ష అనుభవిస్తూ ఉండగా, స్వామి వివేకానంద ‘రాజయోగం’ పుస్తకాన్ని అధ్యయనం చేసారు వివేకానంద. దాని ప్రేరణతోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం తప్పనిసరి అంటూ సావర్కర్ తదితరులు నినాదాలు చేసారు. ఆయన సప్తర్షి, హిందుత్వ పేరుతో పేరుతో కవిత్వం, సాహిత్యం వెలయించారు. సావర్కర్ ‘హిందుత్వ’ నినాదం ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవరావు బలీరాం హెడగేవార్‌కు ప్రేరణ కలిగించింది. దాని ఫలితంగానే ఆయన 1925లో సొంతఇల్లు కట్టుకున్నారు. సంఘానికి సైద్ధాంతిక అండను అందించినవి సావర్కర్ ‘హిందుత్వ’, తిలక్ నడుపుతున్న కేసరి పత్రికలు.
దేశాభివృద్ధి కోసం తన మొత్తం జీవితాన్నే పణం పెట్టిన సావర్కర్‌కు భారత చరిత్రలో ఇసుమంతైనా చోటు లేకుండా చేసారు. స్వాతంత్ర్యం వచ్చాక వామపక్ష చరిత్రకారులు, రాజకీయ ఉన్మాదులూ సావర్కర్ కథను ఇష్టంవచ్చినట్టు మార్చేసారు. అలాగే, అతని ఇమేజ్‌కు భంగం కలిగేలా చాలామంది కష్టపడ్డారు. అతన్ని బ్రిటిష్ వారి బ్రోకర్ అంటూ ప్రచారం చేసారు. ఫలితంగా ఎన్నో హిందూ సంస్థల ప్రతిష్ఠ దిగజారినట్లయింది. వాటి యజమానుల్లో ఆత్మన్యూనతా భావం మొదలైంది. నిజానికి భారతీయ సంస్కృతిలో పురుషార్థాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. తద్వారా వ్యక్తి అంతర్గత శక్తిని తెలుసుకుని దాన్ని సమాజసంక్షేమానికి వినియోగించడం సాధ్యమవుతుంది.
వర్తమానంలో దేశంలోని రాజ్యాంగ, రాజకీయ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఛాందసుల వల్ల సమాజంలోని ఐక్యతను దెబ్బతీసేలా అజెండా అమలవుతోంది. ఈరోజుల్లో భారతీయ సామాజిక ఆలోచనను కేవలం కొన్ని సంస్థలకే వదిలేసి భారతీయులు గుడ్డిగా నిద్రపోతున్నారు. మరోవైపు దేశాన్ని లూటీ చేయాలనే మానసిక స్థితి కలిగిన మతాల వారు కశ్మీర్, బెంగాల్, మోప్లా వంటి పరిస్థితులను దేశమంతటా సృష్టిస్తున్నారు. ఒకప్పుడు తమకంటూ ఒక్కదేశమూ లేని శాంతిమతం ఇవాళ 57 దేశాలను ఆక్రమించింది. ప్రపంచం అంతటినీ ఒకే కుటుంబంగా భావించే సనాతన సంస్కృతి మాత్రం భారతదేశానికి పరిమితమైంది. ఇక్కడ కూడా అంతర్గత సమస్యల మబ్బులు దాన్ని ఆవరించేసాయి. దేశభక్తి, సామాజిక స్పృహ వంటి భావాలను పోగొట్టుకున్న పర్షియా, మెసపొటేమియా వంటి దేశాలు ఇవాళ మనుగడే లేకుండా పోయాయి.
సామాజిక స్పృహ అనేది సమాజంలోని అందరికీ ఉండడం చాలా అవసరం. దానివల్ల సమాజ ఐక్యత సాధ్యమవుతుంది. ప్రమాదకరమైన జిహాద్‌లు, మతమార్పిడులకు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠినమైన చట్టాలు చేసేలా ఒత్తిడి తేగలగాలి. ప్రజల్లో జాతీయతాభావాన్ని చైతన్యపరచడం ద్వారా అటువంటి అంతర్గత సమస్యలను అడ్డుకునేలా సమాజం ఎదగాలి. ‘సంఘే శక్తి కలియుగే’, కలియుగంలో అందరూ కలిసి ఉండడమే శక్తినిస్తుంది అన్న వాక్యాన్ని అన్వయించుకుని, భరతమాత ప్రియపుత్రుడైన సావర్కర్ ప్రేరణతో దేశాన్ని ఐక్యత దిశగా నడిపించాలి. అది భారతీయుడైన ప్రతీఒక్కవ్యక్తి కర్తవ్యం.