ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని కన్యాకుమారిలో పర్యటించనున్నారు. ఈ నెల 30 నుంచి జూన్ 1 వరకు కొనసాగే ఈ పర్యటనలో రాక్ మెమోరియల్ ను సందర్శించి మే 30వ తేదీ సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు అక్కడే ధ్యానం చేయనున్నారు. రెండో రోజు కూడా మోదీ ధ్యానం కొనసాగించే అవకాశముందని కూడా వార్తలొస్తున్నాయి.
గతంలో స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రాంతంలోనే ఉన్న ధ్యాన మండపం వేదికగా ప్రధాని మోదీ రేయింబవళ్ళు ఆసీనులు కానున్నారు. ప్రధాని మోదీ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తుండగా వారణాసిలో జూన్ 1న పోలింగ్ జరగనుంది.
రాక్ మెమోరియల్ ప్రాంతానికి చారిత్రాత్మక గుర్తింపుతో పాటు హిందూ పురాణాల్లోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. శివుడి కోసం పార్వతీదేవి ఈ ప్రాంతంలో తపస్సు చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల కలయిగా కన్యాకుమారి ఉంటుంది.
ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ తరుచూ ఆద్యాత్మిక పర్యటనలు చేస్తుంటారు. 2019లో కేదార్ నాథ్, 2014లో శివాజీ ప్రతాప్ గఢ్ ను సందర్శించారు.