పాన్ కార్డును ఆధార్‌లో లింకు చేసుకోవడాన్ని ఆదాయపన్ను శాఖ తప్పనిసరి చేసింది. 1961 ఆదాయపన్ను చట్టం ప్రకారం ఈ ప్రక్రియను తప్పనిసరి చేశారు. ఇప్పటికే చాలా మంది ఆధార్‌తో పాన్ లింకు చేసుకున్నారు. మరికొందరు ఇంకా చేయాల్సి ఉంది. ఇప్పటికే గడువు ముగిసింది. ఇప్పటికీ లింకు చేయని వారు రూ.1000 అపరాధ రుసుముతో మే 31 వరకు చేసుకోవచ్చు. మే 31 నాటికి కూడా పాన్ ఆధార్ లింకు చేయకపోతే పాన్ కార్డు పనిచేయడం ఆగిపోతుంది.
పాన్ ఆధార్ లింకు చేయకపోతే గరిష్ట పరిమితుల వద్ద పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఐటీ శాఖ హెచ్చరించింది. టీడీఎస్ గరిష్ఠ పరిమితుల వద్ద చెల్లింపు చేయని వారికి నోటీసులు జారీ అవుతాయని ఆదాయపన్ను శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికీ లింకు చేసుకోని వారు..ఈ అవకాశం ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.