మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కేసులకు సంబంధించి జూన్ 6 వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎలాంటి చర్యలు చేపట్టొద్దని ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
ఈవీఎం ధ్వంసం కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయొద్దంటూ ఇప్పటికే ఉత్తర్వులు చేసిన ధర్మాసనం, మాచర్లలో ఎన్నికల హింసకు సంబంధించిన కేసుల్లోనూ జూన్ 6 వరకు అరెస్టు చేయవద్దు అని ఆదేశించింది.
ఈవీఎం ధ్వంసం కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయొద్దంటూ ఇప్పటికే ధర్మాసనం ఆదేశాలు జారీ చేయగా ఎన్నికల సందర్భంగా నమోదు చేసిన ఇతర కేసుల్లోనూ ఆ తేదీ వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు కూడా కోర్టు అనుమతించింది.
ఈవీఎం ధ్వంసం కేసు పిటిషన్ బెయిల్ షరతులే మిగతా కేసులకు వర్తిస్తాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.