వివాదాస్పద మత గురువు, డేరా సచ్చా సౌదా చీఫ్ డేరా బాబాకు ఓ హత్య కేసులో పంజాబ్ హర్యానా హైకోర్టులో ఊరట లభించింది. డేరాబాబా అనుచరుడు రంజిత్ సింగ్ 2002లో హత్యకు గురయ్యాడు. ఆ కేసులో డేరాబాబా నిర్ధోషిగా కోర్టు తీర్పు వెలువరించింది. జస్టిస్ లలిత్ బత్రా, జస్టిస్ సురేశ్ వార్ ఠాకూర్లతో కూడిన డివిజన్ బెంచ్ బాబా అప్పీల్‌ను పరిశీలించి తీర్పు వెలువరించింది.
2002లో డేరాబాబా ప్రధాన అనుచరుడు రంజిత్ సింగ్ హత్యకు గురయ్యాడు. ఆశ్రమంలో మహిళలపై వెలుగు చూసిన లైంగిక దాడులపై రంజిత్ సింగ్ రాసిన లేఖ సంచలనంగా మారిన తరవాత హత్యకు గురయ్యాడు.మేనేజర్‌గా కూడా వ్యవహరించిన రంజిత్ సింగ్ ఆ లేఖ రాశాడని డేరాబాబా అనుమానించినట్లు, అందుకే అతని హత్యకు కుట్రపన్నినట్లు సీబీఐ ఆరోపించింది.
సిర్సా కేంద్రంగా డేరాబాబా కార్యకలాపాలు సాగిస్తూ ఉండేవాడు. అనేక మంది మహిళలపై లైంగిక దాడి చేశాడని, లొంగని వారిని హత్య చేశాడని తేలడంతో 2017లో సీబీఐ కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.