మిజోరంలో విషాదం చోటుచేసుకుంది. ఐజ్వాల్ జిల్లాలో గ్రానైట్ క్వారీ కూలిన ఘటనలో పది మంది కార్మికులు మరణించారు. మరికొంత మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు.పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్వారీ ఉన్న ప్రాంత పరిధిలో భారీ వర్షం కారణంగా సహాయ చర్యలక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షం సహాయక చర్యలు ముందుకు సాగడం లేదు.
భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రభుత్వం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కల్పించింది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షకారణంగా రహదారులపై నీళ్ళు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నదులకు వరద పోటెత్తడంతో నదీపరీవాహక ప్రాంతంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
పరిస్థితిని సమీక్షించిన మిజోరాం డీజీపీ, తగిన సహాయ చర్యలు చేపట్టాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. మిజోరం రాష్ట్రానికి పొరుగు రాష్ట్రాలతో రవాణా సౌకర్యం పూర్తిగా తెగిపోయింది. జాతీయ రహదారులు కొన్నిచోట్ల కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ స్థంభించింది.