రెమాల్ తుఫాను పెను బీభత్సం సృష్టించింది. బెంగాల్, బంగ్లాదేశ్ తీరంలో ఈ తుఫాన్ తీరం దాటింది. గంటకు 135 కి.మీ వేగంతో పెను గాలులు వీయడంతో బెంగాల్‌లోనే 10 వేల సెల్ టవర్లు కూలిపోయాయి. లక్షలాది మంది ఫోన్లు పనిచేయడం నిలిచిపోయాయి. లక్షలాది చెట్లు నేలకొరిగాయి. 10 వేలకు పైగా ఇళ్లు ధ్వంసం అయ్యాయని, 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారని బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లో రెమాల్ తుఫాను బీభత్సానికి 6 మంది బలయ్యారు.
బంగ్లాదేశ్‌లోని మోంగ్లా ఓడరేవు వద్ద రెమాల్ తుఫాను తీరాన్ని దాటింది. రెమాల్ దెబ్బకు బంగ్లాదేశ్‌లో 35 వేల ఇళ్లు ధ్వంసం అయ్యాయి.పది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేలాది పశువులు మృత్యువాతపడ్డాయని ఆందోళన చెందుతున్నారు. రెమాల్ తుఫాను నష్టం బెంగాల్, బంగ్లాదేశ్‌లో తీవ్రంగా ఉంది. నష్టం పూర్తి వివరాలు అందాల్సి ఉంది.