సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయి. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు జరగడంతో లెక్కింపు సందర్భంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. భద్రతా పరమైన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు.
సమస్యాత్మక ప్రాంతాలు, నియోజకవర్గాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నట్టు చెప్పిన ముకేశ్ కుమార్ మీనా, కౌటింగ్ రోజున డ్రైడే అమలు చేయడంతో పాటు రాష్ట్రానికి రాష్ట్రానికి మరో 20 కంపెనీల బలగాలను ప్రత్యేకంగా కేటాయించారని వివరించారు. పోలింగ్ తర్వాత పల్నాడు జిల్లాలో రేకెత్తిన అల్లర్లు అదుపులోకి వచ్చాయన్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు