అగ్నిబాణ్ క్షిపణి ప్రయోగం వాయిదా పడింది. ఇవాళ ఉదయం జరగాల్సిన అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం చివరి క్షణంలో వాయిదా పడింది. సాంకేతిక లోపాలు తలెత్తడంతో క్షిపణి ప్రయోగం వాయిదా వేసినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. కౌంట్‌డౌన్ ప్రారంభమైన ఎనిమిదిగంటల తరవాత అగ్నిబాణ్ క్షిపణి ప్రయోగం వాయిదా పడింది. ఉదయం 5 గంటల 58 నిమిషాలకు జరగాల్సిన ప్రయోగం వాయిదా పడింది.
సెమీ క్రయోజనిక్ ఇంజన్‌తో అగ్నిబాణ్ పనిచేస్తుంది. ఇది దేశంలోనే మొదటిది కావడం విశేషం. త్రీడీ ప్రింటెడ్ ఇంజెన్ ఇందులో ఉపయోగించారు. మరలా ప్రయోగం ఎప్పుడు ఉంటుందనేని స్పష్టత రాలేదు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు