లైంగిక దాడి ఆరోపణలు ఎదొర్కొంటోన్న కర్ణాటక హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సంచలన వీడియో విడుదల చేశారు. మే 31న ఉదయం పది గంటలకు పోలీసుల ముందు హాజరవుతానని వీడియోలో చెప్పారు. తాను ఏప్రిల్ 26న విదేశీ పర్యటనకు వెళ్లాకే తనపై లైంగిక ఆరోపణలు మొదలు పెట్టారని విమర్శించారు. తాను ఎన్నికల తరవాత విదేశీ పర్యటనకు వెళ్లినట్లు వీడియోలో చెప్పుకొచ్చారు.
హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు రాగానే జర్మనీకి పారిపోయాడని పోలీసులు ప్రకటించారు. అయితే తాను పారిపోలేదని టూర్ వెళ్లానంటూ ఎంపీ రేవణ్ణ చెప్పుకొస్తున్నారు. ఏప్రిల్ 26 నుంచి తనపై లైంగిక ఆరోపణలు వస్తున్నాయని ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలో ప్రకటించారు. తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదంటూ రేవణ్ణ చెప్పడం విశేషం.
మాజీ ప్రధాని దేవెగౌడ లొంగిపోవాలంటూ పదే పదే చేసిన ప్రకటనలు సత్ఫలితాలిస్తున్నాయని చెప్పవచ్చు. మాజీ సీఎం కుమారస్వామి కూడా పోలీసుల వద్ద లొంగిపోవాలంటూ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు