మాలేగావ్ ఎంఐఎం కీలక నేత అబ్దుల్ మాలిక్ మహమ్మద్ యూనిస్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. మూడు బులెట్లు యూనిస్‌ను గాయపరిచాయి. చాతిలో, కుడి తొడలో, కుడి చేయిలో బులెట్లు దూసుకెళ్లాయి. స్థానికులు వెంటనే యూనిస్‌ను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం నాసిక్‌లోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఈ ఘటన గత అర్థరాత్రి చోటు చేసుకుంది.
మాలిక్ ఎంఐఎంలో కీలక నేతగా ఉన్నాడు. మాలేగావ్ మేయర్‌గా కూడా పనిచేశాడు. ఓల్డ్ ఆగ్రా రోడ్డులోని ఓ రెస్టారెంట్ వద్ద కూర్చొని ఉండగా దుండగులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. యూనిస్‌పై దాడి ఘటనతో పట్టణంలో అలజడి రేగింది. వెంటనే పోలీసులు బలగాలను మోహరించారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు