మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్లోని నివాసంలో ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కృష్ణాజిల్లా కైకలూరు సమీపంలోని కోడూరు ఆమె స్వగ్రామం. ముదినేపల్లి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీతాదేవి ఎన్టీఆర్ క్యాబినెట్లో విద్యామంత్రిగా సేవలందించారు.
యెర్నేని సీతాదేవి మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యాశాఖలో ఆమె చేసిన సేవలు మరవలేనివని చంద్రబాబు కొనియాడారు. విజయ డైరీ డైరెక్టర్గా కూడా సీతాదేవి వ్యవహరిస్తున్నారు. డెయిరీ రంగంలోనూ ఆమె సేవలను పలువురు ప్రముఖులు గుర్తుచేసుకున్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు