ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతులెత్తేసింది. మంచి ఆట తీరుతో అనూహ్యంగా ఫైనల్స్‌కు చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, కోల్‌కతా జట్టు చేతిలో ఘోర పరాభవం చవిచూసింది. ఫైనల్స్ పోరులో 8 వికెట్ల తేడాతో కోల్‌కతా జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును చిత్తుగా ఓడించింది. 18.3 ఓవర్లకే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం 113 పరుగులు చేసి కుప్పకూలింది. మిచెల్ స్టార్క్ 2, హర్షిత్ రాణా 2, ఆండ్రి రసెల్ 3 వికెట్లు తీశారు.
కోల్‌కతా జట్టులో వెంకటేశ్ అయ్యర్ 26 బంతుల్లో 56 పరుగులు, రహ్మనుల్లా గుబర్భాజ్ 32 బంతుల్లో 39 పరుగులు చేసి 10.3 ఓవర్లలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును చిత్తు చేశారు. కేవలం 2 వికెట్లు కోల్పోయి కోల్‌కతా జట్టు విజయం సాధించింది.పన్నెండేళ్ల తరవాత కోల్‌కతా జట్టు మరలా కప్పు అందుకుంది.