ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడి దాడికి గురైన ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్‌కు బెదిరింపులు ఎక్కువయ్యాయి. రేప్ చేస్తామని, చంపేస్తామంటూ సోషల్ మీడియాలో కొందరు బెదిరింపులకు దిగుతున్నారని ఎంపీ స్వాతి మాలివాల్ వాపోయారు. తాజాగా ధుృవ్ రాథీ అనే యూట్యూబర్ ఎంపీ స్వాతి మాలివాల్‌పై చేసిన వీడియోతో, బెదిరింపులు పరాకాష్టకు చేరాయి.
యూట్యూబర్ ధుృవ్ రాథీ పోస్ట్ చేసిన వీడియోల్లో నిజం లేదని, అవన్నీ ఫేక్ అని సామాజిక కార్యకర్త నిర్ధారించారు. కరోలినా గోస్వామి అనే సామాజిక కార్యకర్త, రాథీ వీడియోలను ఫ్యాక్ట్ చెక్ చేసి తప్పుడు వీడియోలంటూ నిరూపించింది. దీంతో కరోలినాకు కూడా బెదిరింపులు మొదలయ్యాయి.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలోనే ఎంపీ స్వాతి మాలివాల్‌పై సీఎం వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి తరవాత, ఆధారాలు చెరిపివేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. అతని ఐ ఫోన్‌ను ఫార్మాట్ చేయించినట్లు గుర్తించి, ముంబై తీసుకెళ్లి విచారించారు.