మణిపూర్ అల్లర్లను రిజర్వేషన్ల సమస్యగా చూడకూడదని అది ఒక జాతి సమస్య అంటూ కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యానించారు. మైతేయి, కుకీ ట్రస్టుకు సంబంధించిన లోటును భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు షా వెల్లడించారు. మణిపూర్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కేంద్రం ఆలోచన చేస్తోందన్నారు.
గత ఏడాది మేలో అల్లర్లు మొదలయ్యాక మైతేయి, కుకీ తెగలకు చెందిన దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారని అమిత్ షా గుర్తు చేశారు. మైతేయిలు తమకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో వారు ఎస్టీల జాబితాలో ఉండేవారు. తమను మరలా ఎస్టీలుగా గుర్తించి, రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మైతేయిలను ఎస్టీల్లో చేర్చితే, తమకు విద్య, ఉపాధి అవకాశాలు తగ్గుతాయిని కుకీలు ఆందోళన చెందుతున్నారు.