జమ్ము కశ్మీర్లో లోక్‌సభ ఎన్నికలు ముగిశాయని త్వరలో అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. జమ్ము కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తరవాత కేంద్ర పాలిత ప్రాంతాలుగా కొనసాగుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించేందుకు కేంద్రం హామీ ఇచ్చింది. జమ్ము కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వడంతోపాటు అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అసెంబ్లీ రిజర్వేషన్లు తేల్చేపనిలో కేంద్రం చురుగ్గా పనిచేస్తోంది. అందుకు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కూడా పూర్తి చేశారు.
సెప్టెంబరు 30లోపు జమ్ము కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించిన 370 ఆర్టికల్ రద్దు తరవాత కేంద్ర ప్రభుత్వం, జేకేను రాష్ట్రంగా గుర్తిస్తామని హామీ ఇచ్చింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో ఇచ్చిన హామీ మేరకు సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరవాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. రిజర్వేషన్లు తేల్చాల్సి ఉంది. నియోజకవర్గాల పునర్విభజన ఇప్పటికే పూర్తి చేశారు.