రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను జారీ చేసింది. తాజా ఉత్తర్వలను జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈవో ముకేశ్‌కుమార్ మీనా పంపించారు.
రిటర్నింగ్ అధికారి సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు చెల్లుతాయని పేర్కొంది. అయితే ఫామ్ 13ఏపై ఆర్వో సంతకంతో పాటు అన్ని ఓటరకు సంబంధించిన వివరాలు ఉండాలి. ఆర్వో సంతకంతో పాటు ఓటరు రిజస్టర్ తో పోల్చుకోవాలని ఈసీ వివరించింది. ఫామ్ 13ఏలో ఓటరు, ఆర్వో సంతకం, బ్యాలెట్ సీరియల్ నంబర్ లేకపోతే వాటిని తిరస్కరించవచ్చు అని స్పష్టం చేసింది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన ఐదు దశల్లో పోలైన ఓట్ల సంఖ్యను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 76.41 కోట్ల మంది అర్హులైన ఓటర్లలో 50.72 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపింది. పోలైన ఓట్ల సంఖ్యను మార్చడం అసాధ్యమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.