పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులపై యుద్ధం చేస్తోన్న ఇజ్రాయెల్‌కు హెజ్బొల్లా ఉగ్రవాదులు తీవ్ర హెచ్చరికలు చేశారు. త్వరలో ఇజ్రాయెల్‌కు సర్ప్రైజ్ ఇవ్వబొతున్నామంటూ హెజ్బొల్లా నేత హసన్ నస్రల్లాహ్ విడుదల చేసిన వీడియో వైరల్ అయింది. పాలస్తీనాను ఐరోపా దేశాలు ప్రత్యేక దేశంగా గుర్తించాయని, ఇది హమాస్ సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు.
త్వరలో హెజ్బొల్లా ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడబోతోందనే వార్తలు వస్తున్నాయి. రఫాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను కూడా లెక్కచేయడం లేదు. హమాస్‌తో సంధి ప్రయత్నాలు ఫలించలేదు. అక్టోబర్ 27న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడులకు దిగిన తరవాత, అక్కడ యుద్ధం మొదలైంది. నేటికి 8 నెలలుగా యుద్దం కొనసాగుతోంది. రెండు వర్గాల్లో 35 వేల మందిపైగా ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం ఎప్పటికి ముగుస్తుందనే దానిపై నేటికీ స్పష్టత రాలేదు.