ఉత్తరప్రదేశ్‌లోని షాజాహాన్‌పూర్‌లో ఘోరం జరిగింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత షాజాహాన్‌పూర్ జిల్లాలోని ఖుతర్ వద్ద లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఆగి ఉన్న బస్సుపైకి ఎగిరిపడింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 11 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో భక్తులతో కూడిన బస్సు రాత్రి భోజనం కోసం ఓ దాబా వద్ద నిలిపారు. బస్సులోని కొందరు భోజనం తింటుండగా, మరికొందరు సేద తీరుతున్నారు. ఆ సమయంలో అదుపు తప్పిన లారీ బస్సుపై ఎగిరిపడింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 70 మంది ఉండగా, వారంతా ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ నుంచి ఉత్తరాఖండ్‌లోని పూర్ణగిరికి తీర్థయాత్రకు వెళ్తున్నారు.