వాతావరణంలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలతో మాల్దీవులకు పెను ప్రమాదం ముంచుకొస్తోందని ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జు ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా సముద్రపు నీటి మట్టాలు పెరిగిపోవడంతో కేవలం పర్యాటకంపైనే ఆధారపడ్డ దీవులు ముంపునకు గురవుతున్నాయన్నారు. ధనిక దేశాల నుంచి వెలువడే కాలుష్యం వల్ల పర్యావరణంలో మార్పులు చోటు చేసుకుని ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ముయిజ్జు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచంలో అతి తక్కువ కాలుష్యం కేవలం 0.0003 శాతం మాత్రమే విడుదల చేసే మాల్దీవులకు ధనిక దేశాలు ఆర్థిక సాయం చేయాలని అభ్యర్థించారు. ప్రపంచంలో పర్యాటకంపైనే ఆధారపడి బతుకుతున్న పది దీవుల దేశాల అధ్యక్షుల సమావేశం ఇవాళ జరగనున్న నేపథ్యంలో ముయిజ్జు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.