రెండు వేర్వేరు ఘోర అగ్ని ప్రమాదాల్లో 34 మంది చిన్నారులు చనిపోయారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమింగ్ జోన్లో గత రాత్రి చెలరేగిన మంటల్లో 27 మంది చిన్నారులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఓ గేమింగ్ జోన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో చిన్నారులు మృత్యువాతపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 34 మందిని కాపాడారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చెలరేగిన మంటల్లో ఏడుగురు శిశువులు చనిపోయారు. తూర్పు ఢిల్లీ వివేక్ విహార్‌లోని సంరక్షణ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత రాత్రి జరిగిన ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు