77వ కేన్స్ చలనచిత్రోత్సవంలో భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తా అవార్డు గెలుచుకుని కొత్త చరిత్ర సృష్టించారు. భారతదేశానికి కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో అవార్డు రావడం ఇదే మొదటిసారి. అన్సెర్టన్ రిగార్డ్ కేటగిరీలో ఉత్తమ నటి పురస్కారం గెలుచుకున్నారు.
కోల్‌కతాకు చెందిన అనసూయ కొన్నేళ్ళుగా ముంబైలో సినీపరిశ్రమలో ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. బల్గేరియన్ దర్శకుడు కాన్స్టాంటిన్ బొజనోవ్తో ఫేస్బుక్లో ఆమెకు స్నేహం ఉంది. ఒక భారతీయ వేశ్య జీవితం ఇతివృత్తంగా బొజనోవ్ సినిమా తీయాలనుకుని అందులో ప్రధానపాత్రకు అనసూయను ఎంచుకున్నారు. ‘ది షేమ్‌లెస్’ అనే పేరుతో తీసిన ఆ సినిమాను భారత్, నేపాల్ దేశాల్లో చిత్రీకరించారు. ఆ సినిమా షూటింగ్ సుమారు 50 రోజులు జరిగింది.
షేమ్‌లెస్ చిత్రంలో రేణుక అనే వేశ్య పాత్రలో అనసూయ సేన్‌గుప్తా నటించారు. ఆ పాత్రలో ఆమె చూపిన ప్రతిభ అంతర్జాతీయ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ పాత్రకే ఆమె కేన్స్ పురస్కారం గెలుచుకున్నారు.