అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో అతి భారీ వర్షం నమోదైంది. రోడ్లు జలమయం అయ్యాయి. మొగల్రాజపురం, ఏలూరు రోడ్, బందర్ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్ ఆటోనగర్, చిట్టినగర్ ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచి జనం ఇబ్బందులు పడ్డారు. అనంతపురం విడపనకల్లులో అతి భారీ వర్షం నమోదైంది. అనంతపురం జిల్లాలో పలు చెరువులు అలుగుపారుతున్నాయి.
పిఠాపురంలో శుక్రవారం కురిసిన వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. రాబోయే 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి.
తెలుగు రాష్ట్రాలకు రెమాల్ తుఫాను గండం తప్పింది. బంగాళాఖాతం ఆగ్నేయంగా 730 కి.మీ దూరంలో రెమాల్ పెను తుఫానుగా మారే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. అది ఈశాన్యదిశగా పయనించి బంగ్లాదేశ్ వద్ద తీరం దాటే అవకాశముందని తెలుస్తోంది.తుఫాను కదలికలపై వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.