రేవ్ పార్టీలో డ్రగ్స్ స్వీకరించినట్లు తేల్చేందుకు బెంగళూరు సీసీఎస్ పోలీసులు రక్త నమూనాలను సేకరించి ల్యాబులో పరీక్షించారు. దాదాపు 80 మంది రక్తంలో డ్రగ్స్ నమూనాలు బయటపడ్డాయి. పాజిటివ్‌గా తేలిని తెలుగు నటి హేమ, మరో 8 మందికి ఇవాళ బెంగళూరు సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో బెంగళూరులోని సీసీఎస్ ముందు హాజరుకావాలంటూ నోటీసులు అందించారు.
నెల్లూరు వైసీపీ నేత, మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్‌తో రేవ్ పార్టీలో పట్టుబడ్డ పూర్ణారెడ్డికి కూడా సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వైసీపీ నేత పూర్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్ణారెడ్డి రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేయగానే తప్పించుకుని పారిపోయిట్లు సీసీటీవీ విజువల్స్ ద్వారా పోలీసులు నిర్థారించుకున్నారు. ఈ కేసులో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారందరికీ నోటీసులు జారీ చేసి విచారించనున్నారు.