ఆరో దశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఆరో దశలో ప్రముఖులు ఓటేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయాన్నే ఓటేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఓటేశారు. ఉదయాన్నే 7 గంటలకే ఓటేయడంతో ఎస్.జైశంకర్‌కు ఎన్నికల అధికారి సర్టిఫికెట్ ఇచ్చారు. బూత్‌లో మొదటి పురుష ఓటరుగా జైశంకర్ సర్టిఫికెట్ పొందారు.
తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్, బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ దంపతులు, ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రి సౌరభ్ భరద్వాజ్, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ క్యూలైన్లలో నిలబడి ఓటేశారు.
ఆరో విడతలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఢిల్లీ, హర్యానా, ఒడిషా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఒడిషాలోని 42 అసెంబ్లీ స్థానాలకు కూడా ఆరోదశలో పోలింగ్ ప్రశాంతంగా నడుస్తోంది.