సార్వత్రిక ఎన్నికల ఆరోదశ పోలింగ్ మొదలైంది. ఆరో దశలో 58 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. ఆరో విడతలో ఢిల్లీ, హర్యానా, ఒడిషా సహా ఆరు రాష్లాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 58 స్థానాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆరో దశతో కలపి మొత్తం 486 లోక్సభ స్థానాలకు నేటితో ఎన్నికలు పూర్తికానున్నాయి. ఇవాళ 11 కోట్ల మంది తమ ఓటు హక్కు ఉపయోగించుకోనున్నారు.
ఢిల్లీలో మొత్తం ఏడు లోక్సభ స్థాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆప్ 4, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. హర్యానా, ఒడిషా, మరో నాలుగు రాష్ట్రాల్లోని 58 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నేటి ఎన్నికలు పూర్తైతే మొత్తం 541 లోక్సభ స్థానాలకుగాను, 486 స్థానాలకు ఎన్నికలు ముగిసినట్లవుతుంది.