తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సు కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా విడుదలైంది. జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుండగా, జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు. మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియను చేపడతారు. జులై 19న రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత జులై 24న సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 30న ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత ఆగస్ట్ 5న తుది విడత సీట్లను కేటాయించనున్నారు.
తెలంగాణలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదలైంది. రెండు విడుతల్లో కౌన్సెలింగ్ జరగనుంది. జూన్ 20న పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుండగా, . జూన్ 22న తొలి విడత వెబ్ ఆప్షన్లు, జూన్ 30న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 7న రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. జులై 9న రెండో విడత వెబ్ ఆప్షన్లు, జులై 13న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.