ముంబైకి చెందిన నటి లైలాఖాన్, ఆమె కుటుంబ సభ్యుల సామూహిక హత్యకేసులో దోషిగా తేలిన సవతి తండ్రి పర్వేజ్ తక్ కు కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
2011లో లైలాఖాన్ సహా ఆమె కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు నివాసంలోనే హత్యకు గురయ్యారు.
హంతకుడు పర్వేజ్ తక్.. లైలాఖాన్ తల్లి సెలీనాకు మూడో భర్త. సెలీనా ఆస్తుల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు రావడంతో దారుణానికి తెగబడ్డాడు.
2011లో ముంబైలోని తమ బంగ్లాలోనే ముందుగా భార్య సెలీనాను హత్య చేసిన పర్వేజ్ తక్, హతమార్చాడు. అనంతరం ఇంటికి తాళం వేసి ఏమీ పరారు అయ్యాడు.
జమ్ముకశ్మీర్ పోలీసులు పర్వేజ్ తక్‌ను అరెస్ట్ చేసి విచారించేంత వరకు ఈ హత్య విషయం బయటకు పొక్కలేదు. దాదాపు 13 ఏళ్ళ విచారణ అనంతరం మే 9న సెషన్స్ జడ్జి పర్వేజ్‌ను దోషిగా నిర్ధారించారు. నేడు హంతకుడికి మరణశిక్ష ఖరారు చేసి ఉత్తర్వులు జారీ చేశారు.