పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం, వాయుగుండంగా మారింది. ఇది ఈశాన్యం వైపు కదులుతూ మరింతగా బలపడి, మే 25 ఉదయం నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడుతుంది. తదనంతరం, ఉత్తరదిశగా, కదిలి రాత్రికి తీవ్ర తుఫానుగా మారుతుంది. మే 26 న బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ కు ఆనుకొని ఉన్నసాగర్ ద్వీపం మరియు ఖెపుపరా తీరాల దగ్గర తీవ్ర తుఫాను గా తీరాన్ని దాటే అవకాశం ఉంది. తుఫానుకు రెమాల్ గా నామకరణం చేశారు.
రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం మరియు ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో శుక్ర, శనివారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. అలాగే బలమైన ఈదురు గాలులు గంటకు 30 నుంచి40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.