సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన తుది ఫలితాలను పోలింగ్ కేంద్రాల వారీగా వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచేలా ఈసీని ఆదేశించాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలా చేయాలంటే ఈసీ భారీగా మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
సాధారణ ఎన్నికలు పూరైన తరవాత జనరల్ బెంచ్ విచారణ చేస్తుందని న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ గుప్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మల బెంచ్ స్పష్టం చేసింది. తుది ఫలితాలు వచ్చిన 48 గంటల్లో బూతుల వారీగా సమాచారం వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచాలంటూ ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం పిటిషన్ దాఖలు చేసింది.ఇలా సమాచారం ఇస్తే ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని ఈసీ కోర్టుకు విన్నవించింది.