తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని దాడికి గురైన ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ స్పష్టం చేశారు. మర్యాదగా అభ్యర్థించి ఉంటే పదవి నుంచి వైదొలగేదాన్నన్నారు. దాడి చేసి, పదవికి రాజీనామా చేయమంటే చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 2006లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆప్ కోసం శ్రమించినట్లు స్వాతి చెప్పారు. నేను పార్టీలో చేరినప్పుడు కేవలం ముగ్గురు మాత్రమే ఉండేవారని గుర్తుచేశారు. ఎట్టిపరిస్థితుల్లో రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు.
మే 13న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోనే స్వాతి మాలివాల్‌పై సీఎం వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి దిగాడని ఎంపీ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బిభవ్ తన ఫోన్ ఫార్మాట్ చేయించడంతో డేటా మొత్తం డిలీట్ అయింది. సీఎం కేజ్రీవాల్ నివాసం వద్ద సీసీటీవీ ఫుటేజీ కూడా ఎడిట్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.