పసిఫిక్ దేశం పపువా న్యూగినియాలో దారుణం జరిగింది. ఈ ఘటనలో 100 మందికి పైగా మరణించగా పదుల సంఖ్యలో మరణించినట్లు ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది. పపువా న్యూ గినియా రాజధాని పోర్ట్ మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలోని ఎన్గా ప్రావిన్స్‌లోని కావోకలం గ్రామంలో ఈ ప్రకృతి విపత్తు సంభవించింది.
తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. పలు ఇళ్ళు రెప్పపాటులో నేలమట్టం అయ్యాయి.
శిథిలాల కింద ఇరుక్కుపోయిన వారి కోసం గ్రామస్తులు సహాయ చర్యలుచేపట్టారు. పెద్ద పెద్ద బండరాళ్ళు, భారీ వృక్షాలు నేలకూలడంతో సహాయ చర్యలు ముందుకు సాగడం లేదు. మృతుల సంఖ్యపై పపువా న్యూ గినియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.