కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారత్ ఘనత సాధించింది. మైసూరుకు చెందిన ఫిల్మ్‌మేకర్ చిదానంద ఎస్ నాయక్‌ను అవార్డు వరించింది. ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్స్ టు నో’ అనే ఫిల్మ్‌కు లా సినెఫ్ పురస్కారం దక్కింది.
పూణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఏడాది కోర్సు చేసిన చిదానంద, అందులో భాగంగా తీసిన సన్‌ఫ్లవర్స్ చిత్రానికి ఆ అవార్డు దక్కింది. కన్నడ జానపదులకు చెందిన ఓ మహిళ జీవితకథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
బన్నీవుడ్ అనే యానిమేషన్ చిత్రం తీసిన భారతీయ సంతతి మహిళ మాన్సీ మహేశ్వరిని లా సినెఫ్ మూడో అవార్డు వరించింది. మీరట్‌లో జన్మించిన మహేశ్వరి, ఎన్ఐఎఫ్టీ ఢిల్లీలో విద్యాభ్యాసం చేశారు. లా సినెఫ్ అవార్డుల్లో రెండో ప్రైజ్ కొలంబియా యూనివర్సిటీ డైరెక్టర్ ఆస్యా సెగలోవిచ్ను వరించింది.
ఫస్ట్ ప్రైజ్ గెలిచిన వారికి 1,5000 యూరోలు, రెండో ప్రైజ్ విన్నర్‌కు 11,250 యూరోలు, మూడో ప్రైజ్ విన్నర్‌కు 7,500 యూరోలు దక్కుతాయి. అవార్డు దక్కిన సినిమాలను జూన్ 3న పాంథియన్ థియేటర్లో స్క్రీన్ చేస్తారు. గడిచిన ఐదేళ్లలో లా సినెఫ్ అవార్డుల్లో భారత్ కు రెండోసారి ఫస్ట్ ప్రైజ్ దక్కింది. 2020లో అస్మితా గుహ నియోగికి అవార్డు దక్కింది. ఆమె క్యాట్ డాగ్ అనే చిత్రాన్ని రూపొందించారు.