దిల్లీ – జమ్మూ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోరం జరిగింది. మినీ బస్సును ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు చనిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు జమ్మూలోని వైష్ణోదేవి ఆలయానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్లోని బులంద్షార్ ప్రాంతానికి చెందిన 30 మంది వైష్ణోదేవి ఆలయానికి మినీ బస్సులో బయలు దేరారు. వీరంతా ఓకే కుటుంబానికి చెందిన వారు. వీరు ప్రయాణిస్తున్న మీని బస్సుకు ముందు ఓ ట్రక్కు ఉండగా దాని ముందు మరో కారు ప్రయాణిస్తున్నాయి. అయితే కారు డ్రైవర్ ఆకస్మాత్తుగా పెట్రోలు బంక్ వద్ద మలుపు తీసుకున్నాడు. దీంతో ట్రక్కు డ్రైవర్ బ్రేకులు వేయడంతో దాని వెనకాలే ఉన్న బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో ఏడుగురు చనిపోయారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.