Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ముస్లిముల దుశ్చర్య: ప్రైవేటు స్థలంలోని సంత్‌ కనకదాసు విగ్రహం బలవంతంగా తొలగింపు

Phaneendra by Phaneendra
May 24, 2024, 11:12 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తెలంగాణలో ముస్లిములు హిందువుల విశ్వాసాలపై దాడి చేసిన మరో ఘటన వెలుగు చూసింది. కురవ కులస్తులు దైవంగా భావించి ఆరాధించే సంత్ కనకదాసు విగ్రహాన్ని బలవంతంగా తొలగించివేసారు. మే 22న ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న విగ్రహాన్ని తీసేసిన సంఘటనపై పోలీసుల మౌనం హిందువులకు ఆగ్రహం కలిగిస్తోంది. కొంచెం ఆలస్యంగా వెలుగుచూసిన ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డిలో హిందూ ధర్మానికి చెందిన కురవ కులస్తులు ఉన్నారు. వారు సంత్ కనకదాసు అనే హరిదాసు సంప్రదాయాన్ని పాటించేవారు. కనకదాసును వారు దైవంతో సమానంగా, తమ కులదైవంగా పూజిస్తారు. ప్రతీయేటా కనకదాసు జయంతి రోజు ఘనంగా ఆయన సంకీర్తనలు పాడుకోవడం, ఆయనకు పూజలు చేయడం వారికి దశాబ్దాలుగా ఉన్న ఆనవాయితీ.

ఆ క్రమంలో ఈ సంవత్సరం కనకదాసు జయంతి నాటికి ఆయన విగ్రహం ఒకటి శాశ్వతంగా నిర్మించుకుని అక్కడ పూజలు చేసుకోవాలని భావించారు. ఆ మేరకు తమ ప్రైవేటు స్థలంలో కనకదాసు విగ్రహం పెట్టుకున్నారు. మే 22న విగ్రహావిష్కరణకు ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఆ సందర్భంగా అక్కడ తెల్లవారుజామున 4 గంటల నుంచీ పూజలు, ఉత్సవం చేసుకుంటున్నారు. సుమారు 7 గంటల సమయంలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలోని ముస్లిములు మూకుమ్మడిగా అక్కడికి చొరబడ్డారు. ప్రశాంతంగా పూజలు చేసుకుంటున్నవారిని దూషిస్తూ, హింసాత్మకంగా ప్రవర్తిస్తూ ఆ విగ్రహాన్ని తొలగించివేసారు.

స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం ఆ విగ్రహం పెట్టిన ప్రదేశం ఒక ప్రైవేటు స్థలం. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ పక్కాగా ఉన్నాయి. ఆ ప్రైవేటు స్థలం యజమానులకు అక్కడ ఏం నిర్మించుకోవాలన్నా పూర్తి హక్కులున్నాయి. అక్కడ తమ కులదైవం విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం నేరం ఏమీ కాదు. అయితే ముస్లిములు ఆ విగ్రహం అక్కడ రహదారికి అడ్డంగా కట్టారని, తమ ఇళ్ళకు వెళ్ళే దారిని అడ్డగించారనీ తప్పుడు ఆరోపణలు చేసారు. నిజానికి ముస్లిముల ఇళ్ళకు వెళ్ళడానికి సరిపడా దారి విడిగా ఉంది. అయినప్పటికీ వారు తప్పుదోవ పట్టించే సమాచారంతో హిందువులు స్థాపించుకున్న విగ్రహాన్ని బలవంతంగా తీసిపడేసారు. నిజానికి వారి అభ్యంతరం రహదారి కాదు, హిందువులు తాము దైవంగా భావించే సంతు విగ్రహం పెట్టుకోవడం.

ఆ దురాగతంలో పాల్గొన్నవారిలో కొందరిని… మొహమ్మద్ అనే మాజీ ఎంపిటిసి, మాబు సాహెబ్, నవాబ్, రంజుగా గుర్తించారు. స్థానిక ఇమామ్ కూడా విగ్రహం తొలగింపులో పాల్గొన్నారు. దారుణం ఏంటంటే జిల్లా అధికారులు సైతం ముస్లిములకు అనుకూలంగా పక్షపాత ధోరణితో వ్యవహరించడం. మరోసారి అక్కడ విగ్రహం పెట్టడానికి ప్రయత్నించవద్దంటూ స్థానిక హిందువులను అధికారులు బెదిరించారు.

గ్రామంలో సుమారు 800 కుటుంబాలు ఉన్నాయి. వాటిలో ముస్లిం కుటుంబాలు 20 నుంచి 25 మాత్రమే ఉన్నాయి. అయినా వారు హిందువులను తమ పూజలు చేసుకోనీయకుండా హింసాత్మకంగా అడ్డుపడితే అధికారులు సైతం వారికే వంత పాడుతున్నారంటూ గ్రామస్తులు వాపోయారు.  

ఈ సంఘటనపై తెలంగాణ విశ్వహిందూపరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శశిధర్ స్పందించారు. ‘‘గొర్లఖాన్‌దొడ్డిలో ముస్లిముల దుండగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేసి శిక్షించాలి. తెలంగాణలో ముస్లిముల విద్వేషచర్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిముల తీవ్రవాద ధోరణులకు మౌనంగా మద్దతు పలుకుతున్నట్లుంది. ముస్లిముల సెంటిమెంట్లను, వారి మతవిశ్వాసాలను హిందువులు గౌరవిస్తూ వస్తున్నారు. కానీ తమ విశ్వాసాలను గౌరవించాలని ముస్లిములను కోరుతున్నా, వారు విద్వేషంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఒకపక్క హిందువులపై దాడులు చేస్తూ, మరోవైపు తామే బాధితులం అని చెప్పుకునే ముస్లిముల ప్రవర్తన సమస్యాత్మకంగా ఉంది’’ అని శశిధర్ ప్రకటించారు.

సంత్ కనకదాసు 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో భక్తి ఉద్యమాన్ని వ్యాపింపజేసిన ప్రముఖ సాధువు. కర్ణాటకకు చెందిన ఆ ఆధ్యాత్మిక తత్వవేత్త రచించి స్వరపరిచిన భజనలు, కీర్తనలు దక్షిణ భారతదేశ సాంస్కృతిక వికాసంలో ప్రముఖ పాత్ర పోషించాయి.

Tags: Jogulamba Gadwal DistrictMuslims AggressionSaint Kanakadasa StatueSLIDERTelanganaTOP NEWS
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు
general

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ
general

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు
general

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను
general

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

Latest News

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.